Tuesday, November 19, 2019

ఏడు చేపల కథ

అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. అతనికి ఏడుగురు కొడుకులు . వాళ్ళందరూ ఒకసారి వేటకు వెళ్లారు. అందరూ తలా ఒక చేపని పట్టుకున్నారు, అప్పుడు వాటిని ఎండబెట్టారు. కానీ వాటిలో ఒక్క చేప కూడా ఎండలేదు. అందరిలో చిన్న యువరాజు వెళ్లి అడిగాడు చేపని " చేప చేప ఎందుకు నువ్వు ఎండలేదు ?? " అప్పుడు చేప చెప్పింది. " మరేమో ఆ గడ్డిమోపు అడ్డం వచ్చింది నాకు " "ఆహా" అని గడ్డిమోపుని అడిగాడు "గడ్డిమోపు గడ్డిమోపు ఎందుకు నువ్వు ఎండలేదు?? " గడ్డిమోపు చెప్పింది " ఇవాళ ఆవు నన్ను తినలేదు . "ఆ....." ఆవు దగ్గరికి వెళ్లి అడిగాడు " ఆవు ఆవు ఎందుకు గడ్డిమోపుని తినలేదు ఇవాళ?? " "ఎందుకంటే నా యజమాని తిండి పెట్టలేదు నాకు " అప్పుడు యజమాని దగ్గరికి వెళ్ళాడు యువరాజు " యజమాని యజమాని ఎందుకు నువ్వు తిండి పెట్టలేదు ఆవు కి ?? “మరేమో యువరాజా మా బామ్మా నాకు అన్నం పెట్టలేదు "అవునా అని బామ్మా దగ్గరికి వెళ్లి అడిగాడు " ఎందుకు బామ్మా నువ్వు యజమాని కి అన్నం పెట్టలేదు ?? “బామ్మా చెప్పింది " యువరాజా మా ఇంట్లో చిన్న బాబున్నాడు వాడేమోఏడుస్తున్నాడు అని . ఓహో అని చిన్నబాబు దగ్గరికి వెళ్ళాడు " చిన్నబాబు ఎందుకమ్మా ఏడిచావు అని అడుగుతే చెప్పాడు " ఎందుకంటే ఆ చీమ నన్ను కుట్టింది అని.." అయ్యయ్యో ఏయ్ చీమ ఎందుకు చిన్న బాబుని కుట్టవు ?? అంటే " మ్మ్ మరి నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనాఆఆ 🙂 "

No comments:

Post a Comment