Friday, November 1, 2019
తాతల గొప్పలు
చింతలగూడెంలో పనీపాటా లేని ముగ్గురు కోతలరాయుళ్లు ఉండేవారు. రోజూ మధ్యాహ్నం వేళకల్లా రచ్చబండ దగ్గర చేరి పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు. దారిన పోయే వారిని ఎలాగోలా మాటల్లోకి దింపి గేలి చేస్తుండేవారు. ముగ్గురూ రి ప్రముఖుల బంధువులు కావడంతో ఎవరూ ఏమనలేక మిన్నకుండేవారు. ఓ రోజు రంగయ్య అనే రైతు పొలానికి వెళుతుంటే ముగ్గురు స్నేహితులూ పనికట్టుకుని పలకరించి, ఏం రంగయ్యా! ఏనాడూ మాతో మాట్లాడవు. అంత పొగరేంటోయ్ నీకు?’ అన్నారు వెకిలిగా నవ్వుతూ. తాతల నాటి నుంచి మట్టి మనుషులం బాబూ! మాకు పొగరేంటి?’ అంటూ వెళ్లబోయాడు రంగయ్య. స్నేహితుల్లో ఒకడు నవ్వుతూ, మీరంతా మట్టి మనుషులైతే అయ్యారు కానీ, మా తాతల గొప్ప తనం గురించైనా వినకుండా వెళితే ఎలా?’ అన్నాడు. చేసేది లేక రంగయ్య, సరే... చెప్పండయ్యా...’ అన్నాడు. మా తాత భలే ధైర్యశాలి తెలుసా? ఓసారి పందెం కాసి అమావాస్యనాడు శ్మశానంలో రాత్రంతా గడిపి వేయి వరహాలు బహుమతి పొందాడు’ అన్నాడొకడు. రెండోవాడు అందుకుని ఖమా తాత మహా పరాక్రమవంతుడు. ఒట్టి చేతులతో ఒంటరిగా పెద్ద పులిని చంపాడు’ అన్నాడు గొప్పగా. ఇక మూడోవాడు, మా తాత మహాకవి. ఓసారి ఆయన రాజుగారికి ఒక పద్యం చెప్పి సన్మానం పొందాడు’ అని చెప్పాడు. వీళ్ల గొప్పలు భరించలేని రంగయ్య, పొండి బాబూ! మీకు తెలియని సంగతొకటి నేను చెబుతా వినండి. మా తాత, మీ తాతలు స్నేహితులు. మీ తాత పందెం వేసి బిక్కమొహం వేస్తే రాత్రంతా శ్మశానంలో సాయం వున్నది మా తాతయ్యే. ఇక మా తాత పులిని చంపితే మీ తాతయ్య మా తాతయ్యని బతిమలాడుకుని వాళ్లతో తానే చంపినట్టు చెప్పుకున్నాడు. ఇక మా తాత రాసిచ్చిన పద్యాన్నే మీ తాత రాజుగారి దగ్గర చదివి సన్మానం పొందాడు. స్నేహితులంటే మా తాతకి అంత అభిమానం మరి!’ అన్నాడు. ఆ మాటలకు అక్కడ మూగినవారంతా పకపకా నవ్వారు. కోతల రాయుళ్లు ముగ్గురూ మొహం ముడుచుకుని చక్కా పోయారు!
Subscribe to:
Post Comments (Atom)
-
పందికి పన్నీటి స్నానం పుష్కర దేశాన్ని ధనుంజయుడు పాలించేవాడు. అప్పటి వరకు ఉన్న కోశాధికారి చనిపోవడంతో ఆ పదవి ఖాళీ అయ్యింది. ఆ సంగతి తెలిసిన రా...
-
*ఒక ఊళ్లో ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. వాడికి తల్లిదండ్రులు లేరు. ఆ పిల్లవాడు చదువు...
No comments:
Post a Comment