Tuesday, August 15, 2017

పురాణాలెన్ని అవి ఏవి


పురాణములు 18. అవి

  1. పద్మపురాణము 
  2. బ్రహ్మ పురాణము 
  3. విష్ణు పురాణము 
  4. కూర్మ పురాణము 
  5. మత్స్య పురాణము 
  6. అగ్ని పురాణము 
  7. నారదీయ పురాణము 
  8. మార్కండేయ పురాణము 
  9. భాగవత పురాణము 
  10. వామన పురాణము 
  11. వరాహ పురాణము 
  12. వాయు పురాణము 
  13. బ్రహ్మ వైవర్త పురాణము 
  14. శివలింగ పురాణము 
  15. స్కాంద పురాణము 
  16. గరుడ పురాణము 
  17. భవిష్యత్ పురాణము 
  18. బ్రహ్మాండ పురాణము 
ఈ పదునెనిమిది పురాణములు పూర్వమునుండి పేరుగాంచియున్నవి. శాస్త్రములు, పురాణములలో మూడవ భాగము మాత్రము గలవు. పురాణములు 18 కాగ శాస్త్రములు కేవలము 6 మాత్రమే. శాస్త్రములకంటే పురాణములు సంఖ్యలో మూడింతలు పెద్దవైనప్పటికి విలువలో రాతికి రత్నానికి వున్నంత తేడా పురాణములకు, శాస్త్రములకు గలదు. 18 పురాణములకు లేని విలువ 6 శాస్త్రములకుండుట వలన ఆ విషయము పూర్వము కొందరికి జీర్ణము కానిదయ్యెను. పూర్వము కాలగమనములో పురాణప్రియులు ఎక్కువ, శాస్త్రప్రియులు తక్కువైనపుడు, అదే అదనుగ పురాణములకు విలువ చేకూర్చుటకు, శాస్త్రములకు విలువ లేకుండ చేయుటకు, పెద్దకుతంత్రము జరిగినది. శాస్త్రములను లేకుండ చేసి, శాస్త్రముల స్థానములలో మరో ఆరు విధానములను ప్రవేశపెట్టి, అవియే శాస్త్రములని ప్రచారము చేశారు. అలా మొదటి ఆరు శాస్త్రములు శాస్త్రములుగ ప్రచారము కాక, శాస్త్రములుకాని ఆరు శాస్త్రములు ప్రచారమైనవి. అవి వరుసగ 1) శిక్ష 2) వ్యాకరణము 3) చంధము 4) నిరుక్తము 5) జ్యోతిష్యము 6) కల్పము. ఈ కాలములో ఇవి అందరికి తెలియకున్నా వేదపరిచయమున్న వారికి, పురాణములలో పూర్తి మునిగిన వారికి బాగా తెలియును. శాస్త్రముల పేరుతగిలించుకొన్న వీటిలో ఉదాహరణగ ఒకదానిని వివరించుకొని చూస్తాము.