భోగ భాగ్యాలనిచ్చే భోగి🔥, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు..’
Tuesday, January 14, 2020
భోగిపండ్లను పోయారే
భోగిపండ్లను పోయారే| భోగిపండ్ల హారతి పాట
గానం : శ్రీమతి గాయత్రీ గారు
#Bhogipallusongstelugu #bhogipallusongslyrics #Bhogipalluharathisong #bhogipallumangalaharthi
మరిన్ని కథల కోసం సబ్స్క్రయిబ్ చేసుకోండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి
#చుంచు దువ్వి ..
#చుంచు దువ్వి ..
గానం : శ్రీమతి అద్దేపల్లి లక్ష్మి రాజ్యంగారు
చుంచుదువ్వి పింఛం చుట్టెద - గొపాలకృష్ణ
పొంచి ఉండి ఫరుగులేలరా
1. చుంచుదువ్వి పింఛం చుట్టి - పంచదార పాలు పోసి
ఎంచరాని బోజ్జలోవేడి బువ్వపెట్టి బజ్జొపెడుదు ||
చుంచుదువ్వి - చుంచుదువ్వి - | చుంచు |
2. కాళ్ళకు గజ్జెలు కట్టెద - గొపాలకృష్ణ
మెళ్ళోను హారం వేసెద
కాళ్ళాకు గజ్జెలు కట్టి - మెళ్ళోన్ను హారం వెసి
ఒళ్ళోను పప్పులు పోసి పిల్లనగ్రోవి చేతికిచ్చెద ||
చుంచుదువ్వి - చుంచుదువ్వి - | చుంచు |
3. బోజ్జకు పసిడి గజ్జెలు కట్టెద - గొపాలకృష్ణ
బుజ్జి భుజములు తిప్పి ఆడరా
బోజ్జకు పసిడి గజ్జెలు కట్టి - బుజ్జి భుజములు తిప్పి ఆడి
బంగరు తొట్టె నామదిలోనా బాలకృష్ణ నిద్దురపోరా ||
చుంచుదువ్వి - చుంచుదువ్వి - | చుంచు |
#krishnasong #Krishna #aarti #Mangalaharathi #Govinda #Chinnikrishna
మరిన్ని కథల కోసం సబ్స్క్రయిబ్ చేసుకోండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి
Monday, January 13, 2020
పక నవ్వుచు
పక నవ్వుచు , భోగిపండ్ల హారతి పాట
గానం : శ్రీమతి గాయత్రీ గారు
#krishnasong #Krishna #aarti #Mangalaharathi #Govinda #Chinnikrishna #Bhogiharathipatalu
మరిన్ని కథల కోసం సబ్స్క్రయిబ్ చేసుకోండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి
Sunday, January 12, 2020
గొబ్బియల్లో ...
గొబ్బియల్లో ..
గానం : శ్రీమతి గాయత్రీ గారు
#Gobbiyallo #gobbemmasongs #sankranthipatalu #sankrathisongs2020 #gobbemmapatalu
మరిన్ని కథల కోసం సబ్స్క్రయిబ్ చేసుకోండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి
Saturday, January 11, 2020
పసుపున పుట్టావు
సంక్రాంతి సంబరం అంతా గొబ్బిళ్ల వేడుకలలోనే కనిపిస్తుంది. ఇంటిముందు రంగవల్లుల్లాంటి కొత్త బట్టలు ధరించిన ఆడపిల్లు సప్తవర్ణాలు అద్దిన రంగవల్లుల మధ్యలో గొబ్బెమ్మలు ఉంచి వాటిని పూజించి అనంతరం గొబ్బిళ్ళ పాటలు పాడుతుంటే ఆ అందం ఆనందం మరొక సందర్భంలో రాదంటారు పెద్దలు. కానీ మన సనాతన సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో మనం మర్చిపోతున్న గొబ్బెమ్మల పాటను మీకు గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా గొబ్బిపాటలను మీకు అందిస్తున్నాము.
Friday, January 10, 2020
ఒక్కేసి పువ్వు నీ సిగన
ఒక్కేసి పువ్వు నీ సిగన
గానం : అద్దేపల్లి లక్ష్మి రాజ్యం గారు
ఒక్కేసి పువ్వు నీ సిగన చిటికెడు గంధం నా మెడనా చాయ్ చాయ్ అక్కల్లారా సంపెంగి మోగ్గల్లారా జానకి గౌరీ ఉయ్యాలలో
రెండేసి పువ్వు నీ సిగన చిటికెడు గంధం నా మెడనా చాయ్ చాయ్ అక్కల్లారా సంపెంగి మోగ్గల్లారా జానకి గౌరీ ఉయ్యాలలో
మూడేసి పువ్వు నీ సిగన చిటికెడు గంధం నా మెడనా చాయ్ చాయ్ అక్కల్లారా సంపెంగి మోగ్గల్లారా జానకి గౌరీ ఉయ్యాలలో
నాలుగేసి పువ్వు నీ సిగన చిటికెడు గంధం నా మెడనా చాయ్ చాయ్ అక్కల్లారా సంపెంగి మోగ్గల్లారా జానకి గౌరీ ఉయ్యాలలో
ఐదేసి పువ్వు నీ సిగన చిటికెడు గంధం నా మెడనా చాయ్ చాయ్ అక్కల్లారా సంపెంగి మోగ్గల్లారా జానకి గౌరీ ఉయ్యాలలో
#gobbemmapatalu #gobbipatalu #villagegobbemmasongs #sankranthi songs
మరిన్ని కథల కోసం సబ్స్క్రయిబ్ చేసుకోండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి
Thursday, January 9, 2020
ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే
ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే
గానం : శ్రీమతి అద్దేపల్లి లక్ష్మి రాజ్యం గారు
ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే ఈ మాయదారి కృష్ణుడొఛ్చి మహిమ చేసెనే !(2)
ఉట్టిమీద పాలు పెరుగు ఎట్లుదించెనే !(2)
కొట్టబోతె దొరకడమ్మ చిన్ని కృష్ణుడు !!
!!ఏల వచ్చెనమ్మ !!
చీరలన్ని మూటగట్టి చిలిపి కృష్ణుడు !(2)
రవెకలన్ని మూటకట్టి చిలిపి కృ ష్ణుడు ! (2)
చెట్టు మీద దచిపెట్టె చిలిపి కృష్ణుడు
!!ఏల వచ్చెనమ్మ!!
కాళింది మడుగులోన కడుగువాడమ్మా !! (2)
బాలుడు కాదమ్మా పెద్దవాడమ్మా !!
!!ఏల వచ్చెనమ్మ !!
#krishnasong #Krishna #aarti #Mangalaharathi #Govinda #Chinnikrishna
మరిన్ని కథల కోసం సబ్స్క్రయిబ్ చేసుకోండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి
Tuesday, January 7, 2020
కొలని దోపరికి గొబ్బిళ్ళో
గొబ్బెమ్మల పాట
కొలని దోపరికి గొబ్బిళ్ , గానం : జి భారతి గారు
ప|| కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు | కుల స్వామికిని గొబ్బిళ్ళో ||
చ|| కొండ గొడుగుగా గోవుల గాచిన | కొండొక శిశువునకు గొబ్బిళ్ళో |
దండగంపు దైత్యుల కెల్లను తల | గుండు గండనికి గొబ్బిళ్ళో ||
చ|| పాప విధుల శిశుపాలుని తిట్టుల | కోపగానికిని గొబ్బిళ్ళో |
యేపున కంసుని యిడుమల బెట్టిన | గోప బాలునికి గొబ్బిళ్ళో ||
చ|| దండివైరులను తరిమిన దనుజుల | గుండె దిగులునకు గొబ్బిళ్ళో |
వెండిపైడి యగు వేంకట గిరిపై | కొండలయ్యకును గొబ్బిళ్ళో ||
#kolanidopariki #gobbemmasongs #sankranthipatalu #sankrathisongs2020 #gobbemmapatalu
మరిన్ని కథల కోసం సబ్స్క్రయిబ్ చేసుకోండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి
Sunday, January 5, 2020
సుబ్బీ గొబ్బొమ్మా
సుబ్బీ గొబ్బొమ్మా ,గానం : అద్దేపల్లి లక్ష్మి రాజ్యం గారు
ధనుర్మాసంలో వచ్చే సంక్రాంతి సంబరాల్లో కన్నెపిల్లలు ఎక్కువగా సంబరం జరుపుకునేది గొబ్బెలతోనే. వాకిళ్లలో రంగవల్లులు అద్ది.. వాటి మధ్య ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి. వాటిని పూలలో అలంకరించి.. శ్రీ కృష్ణుని చుట్టూ చేరి గోపెమ్మలు ఆడినట్లు.. ఆ గొబ్బెమ్మల చుట్టూ చేరి కన్నెపిల్లలు ఆడటం సంక్రాంతి సంప్రదాయం. ఈ గొబ్బెల చుట్టూ ఆడేటప్పుడు అద్భుతమైన పాటలను కూడా పాడుకుంటూ ఉంటారు అమ్మాయిలు. ఆ ఆటలు, పాటల గురించి తెలుసుకోవాలంటే.. ఇక్కడున్న లింక్ ని ఓ సారి క్లిక్ మనిపించండి.
*సుబ్బీ గొబ్బొమ్మా సుఖము లియ్యవే
చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే
తామర పువ్వంటి తమ్ముడినీయవే
అరటిపువ్వంటి అత్తనీయవే
మల్లెపువ్వంటి మామనీయవే
బంతిపూవంటి బావనీయవే
గుమ్మడిపూవంటి గుమ్మడినీయవే
కమలం పూవంటి కోడలనీయవే
మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే.
మొగిలి పువ్వంటి మొగుణ్ణియ్యవే
#subbigobbemma #subbigobbemmasongs #sankranthipatalu #sankrathisongs2020 #gobbemmapatalu
మరిన్ని కథల కోసం సబ్స్క్రయిబ్ చేసుకోండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి
Saturday, January 4, 2020
తెలుగు మాటలకు తలుపులు తెరుద్దాం.
తెలుగు భాషని మన ఇళ్లలోనే వాడటం మానేసాం. ఇప్పుడు బళ్ళలో కూడా...
ఎప్పుడో కొన్నేళ్ళక్రితం -నాయని జయశ్రీ రాసిన వ్యాసం....
"డోర్ లాక్ చెయ్యకండి"
నేను వెళ్తున్నా, డోర్ లాక్ చేస్కో’, ‘నా కార్ కీస్ ఎక్కడ?’
ఇందులో ‘కార్’ తప్ప అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు.
కానీ మనం వాడం.
ఎందుకు?
ఇది ఈరోజు నాకు హఠాత్తుగా వచ్చిన ఆలోచన కాదు.
చాలా రోజుల నుంచీ మనసులో నలుగుతున్న ప్రశ్నే.
ఓ ఇరవై యేళ్ళు వెనక్కి వెళితే,
తలుపు తాళం వేసుకో,
గడిపెట్టుకో అనే వాళ్ళం.
ఇవేకాదు,
చిన్నతనంలో వినిన, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం.
నిన్నమొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లలకి నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం?
మన తెలుగులో మాటలు లేవా?
ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి.
కానీ మనం పలకం.
వంటింటిని కిచెన్ చేసాం.
వసారా వరండాగా మారింది.
ఇలా చావడి, పంౘ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి, నడవ, పెరడు, ఇవన్నీ మరచిపోయాం.
మన ఇళ్ళకి చుట్టాలు, బంధువులు రావడం మానేసారు.
గెస్ట్‌లే వస్తారు.
ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు.
ఏ లంచో, డిన్నరో చేస్తారు.
భోజనానికి కూర్చొన్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు పెడుతున్నాం.
అందులో వడ్డించేవన్నీ రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై, చికెన్, మటన్ వగైరాలే.
అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, కోడికూర, మాంసం తినండి అంటే ఇంకేమన్నా ఉందా,
వాళ్ళేమనుకుంటారో అని భయం.
అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసికెళ్ళం.
బ్యాగ్ పట్టుకుని షాప్‍కి వెళ్తున్నాము.
అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము.
కూరగాయలు, పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి.
ఏమండీ మీ మనవరాలికి కానుపు అయ్యిందా అని ఆ మధ్య ఓ పెద్దావిడని అడిగా.
ఏంటమ్మా డెలివరీ అయిందా అనకుండా నువ్వింకా కానుపు అంటావేంటి? అని ఎదురు ప్రశ్న వేసింది.
బిత్తరపోవడం నావంతయింది.
టీవీలో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలు,
వంటా-వార్పు కార్యక్రమాలు రోజూ చూసే వాళ్ళకి అలవోకగా ఆంగ్లపదాలు పట్టుబడతాయి మరి.
అందుకే ఆవిడ అలా అని ఉండొచ్చు.
టీవీ వంటల కార్యక్రమంలో ఒకావిడ మనకి వంటకం ఎలా చెయ్యాలో చెబుతుంది.
అది ఏ భాషో మీరే చెప్పండి.
‘కొంచెం సాల్ట్, మిర్చీపౌడర్, ధనియాపౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్‍చేసి,
ఫైవ్ మినిట్స్ కుక్ చెయ్యలి,
స్టౌవ్ ఆఫ్‍చేసి మసాలాపౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చెయ్యాలి.’ ఇలా సాగుతుంది.
మరి మన కూరలకి అల్లం, వెల్లుల్లి, ఉప్పూ, కారాల రుచులు ఎలా తగుల్తాయి?
నిన్న మా పక్కింటాయన వచ్చి
‘మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి,
ఊరికి వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తుండండి’
అని చెప్పి వెళ్ళాడు.
మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది? ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం?
అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేసాం.
అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న
అందరూ పోయి ఆంటీ అంకుల్ మిగిలారు.
ఇప్పుడు అక్క, అన్నా, బావ, మరిది, వదిన, మరదలు వగైరాలంతా దూరమై
కజిన్స్ అయిపోయారు.
పిల్లల్ని బడికి పంపడం కూడ మానేసాం.
స్కూల్‍కే పంపిస్తాం.
సరే బడికి వెళ్ళాక వాళ్ళకి ఎలాగూ ఇంగ్లీషులో మాట్లాడక తప్పదు.
ఇంటి దగ్గరన్నా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోము.
మనం ఎందుకు నిన్నటి వరకు వాడిన తెలుగు మాటలని వదిలేస్తున్నాం?
ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే మనకి సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా?
తెలుగు మాటలు మనకి మొరటుగా ఎందుకనిపిస్తున్నాయి?
ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు.
నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు,
నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం,
ఇతరులు అనుకోవాలన్న భావన.
ఇలా ఆలోచిస్తాం కాబట్టే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి.
\ఒకప్పుడు సంస్కృతం పట్ల ఇదే దృక్పథం అలవరచుకున్న తెలుగు వాళ్ళు
తూర్పు పడమర మిగిల్చారు
కానీ ఉత్తరం దక్షిణం మరచిపోయారు.
ఈ కాలంలో ‘వడ’, ‘తెన్ను’ అంటే ఎవరికి తెలుస్తుంది?
‘జనని సంస్కృతంబె ఎల్ల భాషలకును’
అని భావించిన గొప్పగొప్ప పండితులు
వారి పాండిత్య ప్రకర్ష కోసం
తెలుగు మాటలు వదిలేసి సంస్కృతం వాడటం మొదలుపెట్టారు.
వారి దగ్గర పాఠం వల్లెవేసిన వాళ్ళకి అదే గీర్వాణం వంటబట్టింది.
అదే వరవడిలో మనకి పగలు మిగిలింది, మావు చీకట్లో కలిసిపోయింది.
ఉసురుకి ప్రాణం పోయింది.
ఎడం దూరం అయింది.
అన్నం తినడం మొదలు పెట్టాక కూడు చద్దిపట్టింది.
ప్రస్తుతం మనం సంతోష పడాలన్నా,
బాధ పడాలన్నా,
ఆఖరికి భయపడాలన్నా
సంస్కృతంలోనే పడుతున్నాం.
ఇలా చెబుతూ పోతే వీటికి అంతే లేదు.
వివిధ జానపద కళారూపాలలో ఉన్న ఆనాటి తెలుగు సాహిత్యం,
శాసనాలు దేశీయ ఛందస్సు లోనే ఉండేవి.
తెలుగు కవులు దేశి కవిత్వాన్ని వదిలి మార్గ కవిత బాట పట్టడంతో
చాప కింద నీరులా భాషలో మార్పు వచ్చింది.
ఇంత జరిగినా మన పల్లె పట్టుల్లో మాత్రం
జానపద కళలు నిన్న మొన్నటి వరకు బతికే ఉన్నాయి.
వారి నోట అచ్చ తెనుగు మాటలే వినిపించేవి.
ఇప్పుడు మాత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి.
ఈ మధ్య ఓ సారి ప్రయాణం మధ్యలో
ఒక చిన్న పల్లెటూర్లో కారు ఆపి
ఇక్కడ మంచినీళ్ళ సీసాలు ఎక్కడ అమ్ముతారు బాబూ అని ఒకతన్ని అడిగా.
అతడు కొంచెం వింతగా నావైపు చూసి,
మినరల్ వాటర్ బాటిల్సా మేడం? అన్నాడు.
అవునయ్యా అన్నా.
అలా చెప్పండి మేడం అర్థం అవుతుంది,
అని అవి అమ్మే చోటు చూపించాడు.
మూలమూలలకి విస్తరించిన టివి ప్రసారాలు,
ఇంటర్నెట్ల ప్రభావం వలన ఈ మార్పు చాల త్వరగా జరుగుతూ ఉంది.
భాషలో లేని పదాలను
పరభాషల నుంచి తెచ్చుకొని వాడుకోవడం వల్ల
ఆ భాష పరిపుష్టమౌతుంది.
అలాగని వాడుకలో ఉన్నమాటలని వదిలేసి
పరభాషా పదాలు వాడటం వల్ల భాష క్షీణించిపోతుంది.
ఇంకా సమయం మించిపోలేదు.
ప్రస్తుతం వాడుకలో ఉన్న తెలుగు మాటలు
అంతరించి పోకుండా ఉండాలంటే
మనం వీలైనంత వరకు తెలుగు మాటలే వాడాలి.
బయటకెళితే ఎలాగు తప్పదు అనుకున్నా,
కనీసం ఇంటి గోడల నడుమైనా ఆపని చేద్దాం.
అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్ లాక్ చేసి,
అచ్చ తెలుగు మాటలకు తలుపులు తెరుద్దాం.
- జయశ్రీ నాయని
Friday, January 3, 2020
అటవీస్థలములకరుగుదమా ...
సంక్రాంతి సంబరం అంతా గొబ్బిళ్ల వేడుకలలోనే కనిపిస్తుంది. కానీ మన సనాతన సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో మనం మర్చిపోతున్న గొబ్బెమ్మల పాటను మీకు గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా గొబ్బిపాటలను మీకు అందిస్తున్నాము.
అటవీస్థలములకరుగుదమా ,
గానం : అద్దేపల్లి లక్ష్మి రాజ్యం గారు
అటవీస్థలములకరుగుదమా చెలి వటపత్రంబులు కోయుదమా
అటవీస్థలములకరుగుదమా చెలి వటపత్రంబులు కోయుదమా
చింతాపిక్కాలాడుదమా సిరి సిరి నవ్వులు నవ్వుదమా
చింతాపిక్కాలాడుదమా సిరి సిరి నవ్వులు నవ్వుదమా
అటవీస్థలములకరుగుదమా చెలి వటపత్రంబులు కోయుదమా
గుంటలు గుంటలు త్రవ్వుదమా చెలి గోళీకాయాలాడుదమా
గుంటలు గుంటలు త్రవ్వుదమా చెలి గోళీకాయాలాడుదమా
అటవీస్థలములకరుగుదమా చెలి వటపత్రంబులు కోయుదమా
చెమ్మచెక్కలాడుదామా చెలి చక్కిలిగింతలు పెట్టుదామా
చెమ్మచెక్కలాడుదామా చెలి చక్కిలిగింతలు పెట్టుదామా
అటవీస్థలములకరుగుదమా చెలి వటపత్రంబులు కోయుదమా
కోతికొమ్మచ్చిలాడుదామా చెలి కొమ్మల చాటున దాగుదామా
కోతికొమ్మచ్చిలాడుదామా చెలి కొమ్మల చాటున దాగుదామా
అటవీస్థలములకరుగుదమా చెలి వటపత్రంబులు కోయుదమా
సన్నాజాజులు కోయుదమా దండలు దండలు గుచ్చుదమా
సన్నాజాజులు కోయుదమా దండలు దండలు గుచ్చుదమా
స్వామి మెడలో వేయుదమా
స్వామి మెడలో వేయుదమా
స్వామి మెడలో వేయుదమా
#gobbemmapatalu #gobbipatalu #villagegobbemmasongs #sankranthi songs
మరిన్ని కథల కోసం సబ్స్క్రయిబ్ చేసుకోండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి
Subscribe to:
Posts (Atom)
-
పందికి పన్నీటి స్నానం పుష్కర దేశాన్ని ధనుంజయుడు పాలించేవాడు. అప్పటి వరకు ఉన్న కోశాధికారి చనిపోవడంతో ఆ పదవి ఖాళీ అయ్యింది. ఆ సంగతి తెలిసిన రా...
-
*ఒక ఊళ్లో ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. వాడికి తల్లిదండ్రులు లేరు. ఆ పిల్లవాడు చదువు...