Wednesday, November 27, 2019
నిజామా? అబద్దమా ?
రంగాపురం జమీందారుకి తాతముత్తాతలు కూడబెట్టిన ఆస్తి బోలెడంత ఉంది. ఆయనకు పందేలు కాయడమంటే తెగ ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక విచిత్రమైన పందెం కట్టి ఎదుటివాళ్లను ఓడించేవాడు. ఎవరైనా గెలిస్తే మాత్రం వారికి బహుమతులు ఇచ్చేవాడు.
ఓ రోజు జమీందారు ఇంటికి స్నేహితులు వచ్చారు. కాసేపు అంతా సరదాగా మాట్లాడుకున్నారు. అంతలో మిత్రుల్ని ఉద్దేశించి ‘మీలో ఎవరైనా సరే ఒక అబద్ధం చెప్పి అది నిజమని నన్ను నమ్మించగలిగితే పది ఎకరాల భూమి రాసిస్తా. లేని పక్షంలో ఈ ఏడాది మీ పొలంలో పండిన పంటంతా ఇచ్చేయాలి. ఇది షరతు’ అన్నాడు జమీందారు.
చెప్పేది అబద్ధమని ముందే తెలుసు కాబట్టి ఆయన ఎలాగూ నమ్మడు. ప్రయత్నించి విఫలమైతే ఈ ఏడాది పంటా దక్కదు. అవసరమా?’ అనుకుని ఎవరూ మాట్లాడలేదు.
ఇంత చిన్న పందేనికి మీలో ఎవరూ ముందుకు రాలేరా?’ సవాలుగా అన్నాడు జమీందారు.
వారిలో రామయ్య అందుకుని ‘మిత్రమా! నేను ఇప్పుడే ఒక అబద్ధం చెప్పి దాన్ని నిజమని నమ్మించగలను’ అన్నాడు.
ఆలస్యమెందుకు రామయ్యా! ఆ అబద్ధం ఏంటో వెంటనే చెప్పి నన్ను నమ్మించు’ అన్నాడు జమీందారు ఉత్సాహంగా.
అప్పుడు రామయ్య ‘నువ్వు నాకు పదెకరాల భూమిని రాసిస్తున్నావు. ఈ మాట అబద్ధం’ అన్నాడు.
జమీందారు చప్పున ‘ఔను’ అనేశాడు. వెంటనే ఆలోచనలో పడ్డాడు.
రామయ్య చెప్పిన అబద్ధాన్ని తాను నిజమని ఒప్పుకున్నాడు కాబట్టి పందెంలో తను ఓడిపోయినట్టే.
ఒకవేళ మాట మార్చి ‘లేదు’ అంటే భూమిని రాసివ్వాల్సి ఉంటుంది. ఏరకంగా చూసినా తాను రామయ్యకు భూమిని రాసివ్వాల్సిందే!
ఇరకాటంలో పడిపోయిన జమీందారు చివరకు తన ఓటమి ఒప్పుకోక తప్పలేదు.
రామయ్య తెలివితేటల్ని అందరూ మెచ్చుకున్నారు.
Wednesday, November 20, 2019
అత్యాశ
ఒక మానవుడు విచారంగా కుర్చుని బాధపడుతున్నాడు . అటు వైపు వచ్చిన ఓ సన్యాసీ అతడి దుఃఖం కి కారణం తెలుసుకోవాలనుకున్నాడు .
సన్యాసీ :- ఓ మానవా ! ఏమిటి నీ బాధ ?
మానవుడు :- జీవితం లో సంతోషమే లేదు స్వామి .
వెంటనే ఆ సన్యాసీ తన చూపుడు వేలును అక్కడున్న రాయికేసి చాచాడు .
ఆ రాయి బంగారు రాయి గా మారిపోయింది .
సన్యాసీ :- ఇప్పుడు సంతోషమేన ?
మానవుడు :- ఆఆ ...అదొక రాయే కదా !
ఈ సారి తన చూపుడు వేలుతో ప్రక్కనే ఉన్న చెట్టును బంగారు చెట్టు గా మార్చేసాడు .
సన్యాసీ :- ఇప్పుడేమంటావు ?
మానవుడు :- అదొక చెట్టే కదా !
మల్లి చూపుడు వేలును ఇంటివైపు చూపించాడు . ఇల్లు బంగారు ఇల్లు గా మారిపోయింది .
సన్యాసీ :- ఇది చాలా ?
మానవుడు :- అదొక ఇల్లే కదా !
సన్యాసీ :- ఇంత బంగారాన్నిచినా నీకు సంతోషం కలగలేదే ! అయితే నీకేం కావాలి ?
మానవుడు :- నీ చూపుడు వేలు కావాలి స్వామి .!
😳😳😃😃😃😆😆
Tuesday, November 19, 2019
ఏడు చేపల కథ
Friday, November 1, 2019
తాతల గొప్పలు
చింతలగూడెంలో పనీపాటా లేని ముగ్గురు కోతలరాయుళ్లు ఉండేవారు. రోజూ మధ్యాహ్నం వేళకల్లా రచ్చబండ దగ్గర చేరి పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు. దారిన పోయే వారిని ఎలాగోలా మాటల్లోకి దింపి గేలి చేస్తుండేవారు. ముగ్గురూ రి ప్రముఖుల బంధువులు కావడంతో ఎవరూ ఏమనలేక మిన్నకుండేవారు. ఓ రోజు రంగయ్య అనే రైతు పొలానికి వెళుతుంటే ముగ్గురు స్నేహితులూ పనికట్టుకుని పలకరించి, ఏం రంగయ్యా! ఏనాడూ మాతో మాట్లాడవు. అంత పొగరేంటోయ్ నీకు?’ అన్నారు వెకిలిగా నవ్వుతూ. తాతల నాటి నుంచి మట్టి మనుషులం బాబూ! మాకు పొగరేంటి?’ అంటూ వెళ్లబోయాడు రంగయ్య. స్నేహితుల్లో ఒకడు నవ్వుతూ, మీరంతా మట్టి మనుషులైతే అయ్యారు కానీ, మా తాతల గొప్ప తనం గురించైనా వినకుండా వెళితే ఎలా?’ అన్నాడు. చేసేది లేక రంగయ్య, సరే... చెప్పండయ్యా...’ అన్నాడు. మా తాత భలే ధైర్యశాలి తెలుసా? ఓసారి పందెం కాసి అమావాస్యనాడు శ్మశానంలో రాత్రంతా గడిపి వేయి వరహాలు బహుమతి పొందాడు’ అన్నాడొకడు. రెండోవాడు అందుకుని ఖమా తాత మహా పరాక్రమవంతుడు. ఒట్టి చేతులతో ఒంటరిగా పెద్ద పులిని చంపాడు’ అన్నాడు గొప్పగా. ఇక మూడోవాడు, మా తాత మహాకవి. ఓసారి ఆయన రాజుగారికి ఒక పద్యం చెప్పి సన్మానం పొందాడు’ అని చెప్పాడు. వీళ్ల గొప్పలు భరించలేని రంగయ్య, పొండి బాబూ! మీకు తెలియని సంగతొకటి నేను చెబుతా వినండి. మా తాత, మీ తాతలు స్నేహితులు. మీ తాత పందెం వేసి బిక్కమొహం వేస్తే రాత్రంతా శ్మశానంలో సాయం వున్నది మా తాతయ్యే. ఇక మా తాత పులిని చంపితే మీ తాతయ్య మా తాతయ్యని బతిమలాడుకుని వాళ్లతో తానే చంపినట్టు చెప్పుకున్నాడు. ఇక మా తాత రాసిచ్చిన పద్యాన్నే మీ తాత రాజుగారి దగ్గర చదివి సన్మానం పొందాడు. స్నేహితులంటే మా తాతకి అంత అభిమానం మరి!’ అన్నాడు. ఆ మాటలకు అక్కడ మూగినవారంతా పకపకా నవ్వారు. కోతల రాయుళ్లు ముగ్గురూ మొహం ముడుచుకుని చక్కా పోయారు!
Subscribe to:
Posts (Atom)
-
పందికి పన్నీటి స్నానం పుష్కర దేశాన్ని ధనుంజయుడు పాలించేవాడు. అప్పటి వరకు ఉన్న కోశాధికారి చనిపోవడంతో ఆ పదవి ఖాళీ అయ్యింది. ఆ సంగతి తెలిసిన రా...
-
*ఒక ఊళ్లో ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. వాడికి తల్లిదండ్రులు లేరు. ఆ పిల్లవాడు చదువు...